- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది రెడ్ బ్యాగ్’ సినిమా నుంచి హీరోయిన్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..
న్యూ ఫేస్.. న్యూ ఫైర్.. న్యూ ఎరా.. ఆమె రూల్స్ పాటించడానికి రావట్లేదు.. ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి వస్తోంది" అంటూ రాధ్య క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా ఇంట్రడ్యూస్ చేశారు.

దిశ, సినిమా: రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ . ఈ సినిమాను హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా రాజీ పడకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఒక రహస్యమైన బ్యాగ్ చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన కథతో రూపొందుతోంది. ఈ చిత్రంలో రాధ్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. షూటింగ్ చాలా శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా, మూవీ మేకర్స్ హీరోయిన్ రాధ్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ రాధ్య చేతిలో ఒక గన్ పట్టుకుని ఎంతో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించింది. ఆమె లుక్‌తో పాటు చేతిలో ఉన్న ఆ ‘రెడ్ బ్యాగ్’ కూడా పోస్టర్‌లో హైలైట్‌గా కనిపిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ మేకర్స్ పెట్టిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
"న్యూ ఫేస్.. న్యూ ఫైర్.. న్యూ ఎరా.. ఆమె రూల్స్ పాటించడానికి రావట్లేదు.. ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి వస్తోంది" అంటూ రాధ్య క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా డిఫరెంట్‌గా, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సీనియర్ నటి రాశీ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆమెతో పాటు టాలీవుడ్‌లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న కబీర్ దుహాన్ సింగ్, ప్రసాద్ బెహరా, మోనిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక రహస్యమైన బ్యాగ్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ బ్యాగ్ కోసం జరిగే పోరాటంలో హీరోయిన్ పాత్ర ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హీరోయిన్ పవర్‌ఫుల్ పోస్టర్, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతోంది.






