Sumati Shatakam: ట్రెడీషనల్ లుక్‌లో హీరోయిన్ ఫష్ట్ లుక్..

by Chukka Sudharani |   (  Updated:2025-07-18 15:31:28  IST  )

సీరియల్స్ అండ్ బిగ్‌బాస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Sumati Shatakam: ట్రెడీషనల్ లుక్‌లో హీరోయిన్ ఫష్ట్ లుక్..
X

దిశ, సినిమా: సీరియల్స్ అండ్ బిగ్‌బాస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుమతీ శతకం’ నుంచి ఇటీవల.. హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అందరిని ఆకట్టుకుంది. తాజాగా హీరోయిన్ సయాలీ పాత్రకు పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వింటేజ్ విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తుండగా.. ట్రెడీషనల్ లుక్‌లో హీరోయిన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

కాగా.. ఈ సినిమాను కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ టీజర్‌ను త్వరలో విడుదల చేసి సినిమాపై మరింత అంచనాల్ని పెంచుతామని, అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఉంటాయని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని అన్నారు.

Next Story