- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zareen Khan: చావుపై కూడా ఇలాంటి వార్తలు బాధకరం.. షెఫాలీ జారివాలా మృతిపై నటి ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ నటి షెఫాలీ జారివాలా (42) ఇటీవల (జూన్ 27, 2025) మరణించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి షెఫాలీ జారివాలా (42) ఇటీవల (జూన్ 27, 2025) మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణం ఫ్యాన్స్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే షెఫాలీ మరణంపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నిజాయితీగా చెప్పాలంటే.. ఒకరి మరణంపై వస్తున్న వార్తలపై ఏమి చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఎందుకంటే.. మీరు వైరల్ చేస్తున్న వార్తల్లో ఏదైనా రుజువు ఉందా?.. ఇది నిజంగా చాలా దురదృష్టకరం.. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, మీడియా వారి చుట్టూ తిరగడం చాలా బాధాకరం.
కుటుంబం దుఃఖంలో ఉంది.. భర్త మనసునిండా బాధను నింపుకుని ఉంటాడు.. అయినప్పటికీ మీడియా అసలు ఏమి జరిగిందని వాళ్లను ప్రశ్నిస్తున్నారు. మానవత్వం ఎక్కడ ఉంది? అసలు ఆమె మరణానికి కారణం మనకు నిజంగా తెలుసా? పోని ఎవరైనా వైద్యుడి నుంచి దీనిపై క్లారిటీ వచ్చిందా..? మన దగ్గర నిజమైన రుజువు లేనప్పుడు ఎలా మాట్లాడతారు. ఆమె కుటుంభానికి మన సానుభూతి అవసరం.. డాక్టర్స్ నుంచి మనకు ఖచ్చితమైన సమాచారం వచ్చే వరకు ఈ ఊహాగానాలు అంతం కావాలి.. ఆమెలో చావులో అయినా శాంతితో విశ్రాంతి తీసుకోనివ్వండి’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. లింక్






