పాకిస్తాన్ నటుడిని పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

పాకిస్తాన్ హీరోయిన్ మావ్రా హొకేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

పాకిస్తాన్ నటుడిని పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: పాకిస్తాన్ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొదట బుల్లితెరపై కనిపించి తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో ఆమె నటించిన ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇందులో హీరోగా హర్ష వర్దన్(Harsh Vardhan) నటించగా.. రాధిక రావు-వినయ్ సప్రు(Radhika Rao-Vinay Sapru) దర్శకత్వంలో వచ్చింది. అయితే ఈ మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దీంతో మావ్రాకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మావ్రా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఓ వైపై చిత్రాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. అయితే ఆమె పాకిస్తాన్ నటుడు అమీర్ గిలానీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు స్పందించలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా, మావ్రా, అమీర్ గిలానీ(Ameer Gilani ) ఫిబ్రవరి 5న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అయితే ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరయ్యారు. ఇక మావ్రా తన వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘గందరగోళం మధ్యలో.. నేను నిన్ను కనుగొన్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే పెళ్లిలో ఆమె ఎమోషనల్‌కు గురై ఏడుస్తుండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఇక మావ్రా ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. కొంతమంది మాత్రం షాక్ అవుతున్నారు. ప్రేమ గురించి వచ్చిన రూమర్స్‌పై అందుకే రియాక్ట్ కాలేదని అభ్రిప్రాయ పడుతున్నారు.

Next Story