- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోలకు ప్రశంసలు.. హీరోయిన్స్‌కు విమర్శల? ఇండస్ట్రీలో ఉన్న వ్యత్యాసంపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి యాక్టింగ్‌తో పాటు అందంతో తనకంటూ స్పెషల్ ఇమేన్‌ను సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి యాక్టింగ్‌తో పాటు అందంతో తనకంటూ స్పెషల్ ఇమేన్‌ను సొంతం చేసుకుంది. 2007లోనే తన సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత మరో చిత్రం చెయ్యని ఈ అమ్మడు.. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘జీ2’ (G2)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అడివిశేష్ హీరోగా వస్తున్న ఈ మూవీ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస మూవీస్ చేస్తున్న వామికా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యత్యాసంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలకు వేరేలా రెమ్యునరేషన్స్ ఇస్తారు. కానీ, సినిమా ఫెయిల్ అయితే మాత్రం హీరోయిన్‌ను తప్పుపడతారు. మరి ఓ సినిమా విఫలమైనప్పుడు హీరోను ఎందుకు తప్పుపట్టరు... అలాగే వారికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించరు.. రెమ్యునరేషన్స్ వారికే, ప్రశంసలు వారికే.. కానీ విమర్శలు మాత్రం హీరోయిన్స్‌కు’ అంటూ మాట్లాడింది. ప్రజెంట్ వామికా కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






