- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిష సినిమాలకు గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన దర్శుడు!!
స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా.. దీనిపై తాజాగా నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తుండగా.. దీనిపై తాజాగా నటుడు, దర్శకుడు చిత్ర లక్ష్మణన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సోషల్ మీడియాలో అకౌంట్ యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై తెలిసిన నిర్మాతలను సంప్రదించగా.. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగాలని అనుకోవడం లేదని, వచ్చిన అవకాశాలు సైతం తిరస్కరిస్తున్నారు అని వారు తెలిపారు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారడంతో.. ఫుల్ క్లారిటీ ఉంటేనే చిత్ర లక్ష్మణన్ ఇలాంటి కామెంట్స్ చేస్తారని.. కాబట్టి త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పడం వాస్తవమే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.






