Trisha : ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది అంటూ స్టార్ హీరోయిన్ త్రిష పోస్ట్.. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావా అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |

అలనాటి అందాల తార త్రిష (Trisha).. 40+ ఏళ్ల వయస్సులో కూడా తన అందాలతో కుర్రహీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది.

Trisha : ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది అంటూ స్టార్ హీరోయిన్ త్రిష పోస్ట్.. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అలనాటి అందాల తార త్రిష (Trisha).. 40+ ఏళ్ల వయస్సులో కూడా తన అందాలతో కుర్రహీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. అంతే కాకుండా ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ (Second innings) స్టార్ట్ చేసి వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ (Back to back) చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) ఒకటి. ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. తన ప్రోషినల్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగతంగతమైన అంశాలు కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన X అకౌంట్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది’ (Love always wins) అంటూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేసింది. ప్రజెంట్ ఈ ఫొటో వైరల్ అవుతుండగా.. ‘ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావా’, ‘సూపర్ క్యూట్’ ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story