Tamannaah Bhatia: మనసు ప్రశాంతత కోసం నేను చేసే పని అదే.. తమన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-16 11:17:18  IST  )

మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.

Tamannaah Bhatia: మనసు ప్రశాంతత కోసం నేను చేసే పని అదే.. తమన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. అలాగే.. తన వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ అంటూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ హిందీలో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు తమన్న చేతీలో బాలీవుడ్ ప్రాజెక్టులు నాలుగైదు ఉండగా.. తెలుగులో ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకపోవడం విశేషం. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న.. తన పర్సనల్ విషయాలు పంచుకుంది. ‘ఈ మధ్య మళ్లీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. అలా అని ఫుడ్, పని, లేక వ్యక్తిగత ఇష్టాలను పక్కకు పెట్టను.

నాకు ఏం చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తా.. ఏది తినాలంటే అదే తింటా. ఏదీ బలవంతంగా చేయను. ఇక అలసటగా ఉన్నా.. సరిగ్గా నిత్ర లేకపోయినా ఎక్సర్సైజ్ చేయకుండా విశ్రాంతి తీసుకుంటా. ఎక్కువ రెస్ట్ తీసుకునేందుకే ప్రెయారిటీ ఇస్తా. ఇంకా విరామం దొరికినప్పుడు ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్లి ధ్యానం చేయడం, లేదా దేవాలయాలకు వెళ్లడానికి ఇష్టపడతాను. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు.. మంచి అనుభవాన్నిస్తుంది. అయితే ఎక్కడికి వెళ్లిన ఫ్యామిలీతో వెళ్లేందుకు ఎక్కువ ప్రయత్నిస్తాను’ అని తెలిపింది.

Next Story