Taapsee: ‘మన మాటలే వ్యక్తిత్వానికి అద్దం పడతాయి’.. సొట్టబుగ్గల సుందరీ సెన్సేషనల్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-02-22 12:43:53  IST  )

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Taapsee: ‘మన మాటలే వ్యక్తిత్వానికి అద్దం పడతాయి’.. సొట్టబుగ్గల సుందరీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఝుమ్మందినాదం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. వస్తాడు నా రాజు, వీర, దరువు, మొగుడు, సాహసం, గుండెల్లో గోదారి, దొంగాట, గేమ్ ఓవర్, అనబెల్ సేతుపతి, మిషన్ ఇంపాజిబుల్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. హిందీలో పింక్, నామ్ షబానా, సూర్మ, దిల్ జంగ్లీ, మిషన్ మంగళ్, హసీనా దల్ రుబ, దొబారా వంటి చిత్రాల్లో తన అద్భుతమైన ప్రదర్శనను చాటింది.

షారుఖ్ ఖాన్ సరసన ఢంకీ సినిమాలో కూడా అద్భుతంగా నటించి జనాల్ని ఆకట్టుకుంది. ఈ మూవీ 2023 లో డిసెంబరు 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి.. మంచి టాక్ సొంతం చేసకుంది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా పలు కామెంట్స్ చేసింది. ఎవరూ ఏం కామెంట్స్ చేసినా నేనేమీ పెద్దగా పట్టించుకోనని వెల్లడించింది. అప్పట్లో కంగనను కాపీ కొడుతున్నారని నాపై కామెంట్లు చేశారని తెలిపింది. కానీ అలా అనుకుంటే నాకేమీ ఇబ్బంది లేదు.. తను చాలా టాలెంట్ ఉన్న మహిళ.. ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ నేను అందుకోవడం లేదంటూ చెప్పుకొచ్చింది.

ఆ నటిని కాపీ కొడుతున్నారని అనుకుంటే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని, మనిషి మాటలే మన వ్యక్తిత్వానికి అద్దం పడుతాయని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదని పేర్కొంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుందని అనుకుంటే అది మన మిస్టేకే అవుతుందని తాప్సీ వివరించింది. కానీ ఎందరితో ఎన్నో మాటలు పడాల్సి ఉంటుందని.. సక్సెస్ రాకపోతే ప్లాన్ బి సిద్ధం చేసుకోండని వెల్లడించింది. ప్రస్తుతం తాప్సీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story