- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srinidhi Shetty: వారి సహకారంతోనే అది సాధ్యం అయింది.. పాన్ ఇండియా హీరోయిన్ వైరల్ కామెంట్స్
‘కేజీఎఫ్’ (KGF) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).

దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ (KGF) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty). ఇక మొదటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకున్న ఈ అమ్మడు.. కేజీఎఫ్-2 తర్వాత తన గ్రాఫ్ మరింత పెంచుకుంది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సరసన ‘హిట్-3’ (Hit-3)లో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగు భాష నేర్చుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నేచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’. హిట్ ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.
నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నా ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ (Teaser), ఫస్ట్ లుక్ వంటి అప్‌డేట్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల ఉన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈమూవీ మే 1న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ నిధి శెట్టి మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీ(Telugu Industry)లోకి అడుగుపెట్టినప్పుడు కాస్త భయం అనిపించింది. అయితే నానితో కలిసి పని చేయడం స్టార్ట్ చేశాక చాలా కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాను. ఇక తెలుగు నేను 70శాతం నేర్చుకున్నాను. తెలుగులో కొన్ని పదాలు పలికినప్పుడు వాటి పదాలు చాలా బాగా అనిపిస్తాయి. నాని, మా మూవీ టీమ్ సహాయంతో తెలుగు మరింత వేగంగా నేర్చుకోగలిగాను. వారి సహకారంతోనే ఇది ఇంత త్వరగా సాధ్యం అయింది’ అంటూ చెప్పుకొచ్చింది.






