- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
sreeleela: చిన్నారితో క్యూట్ ఫొటోలు పంచుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల.

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద దూసుకుపోయింది కుర్ర హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ మొదట్లో చిన్న చిన్న హీరోల సరసన నటించింది. వెంటనే ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన అవకాశం కొట్టేసింది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస అవకాశాలు దక్కాయి. ఈ అమ్మడు అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు.
కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైత పట్టింది. ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సేషనల్ బ్యూటీ నెట్టింట ఓ ఆకట్టుకుంటోన్న ఫొటో అభిమానులతో పంచుకుంది. చబ్బీ చబ్బీ చెంపలతోనున్న ఓ క్యూట్ బేబీతో ఫొటోలు దిగింది. అంతేకాకుండా ఈ చిన్నారికి ముద్దు పెడుతూ ఫోజులిచ్చింది. ప్రస్తుతం శ్రీలీల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






