Shriya: చెక్కు చెదరని అందంతో దర్శనమిచ్చిన సీనియర్ స్టార్ నటి.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు

by Kodari Anjali |   (  Updated:2025-03-10 17:56:04  IST  )

టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Shriya: చెక్కు చెదరని అందంతో దర్శనమిచ్చిన సీనియర్ స్టార్ నటి.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 2001లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

తొలి చిత్రంతోనే శ్రియ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ ఏకంగా సీనియర్ హీరోలైన నాగార్జున (Nagarjuna), బాలకృష్ణ (Balakrishna), ప్రభాస్ (PrabhasRavi Teja), రవితేజ() సరసన అవకాశాలు దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు సొంతం చేసుకుంది.

నేనున్నాను, ఛత్రపతి (Chhatrapati), ఛత్రపత, తుఝే మేరీ కసం(Tujhe meri kasam), అవరసన్, సరన్ ఎనక్కు 20 ఉనక్కు 18, శివాజీ, ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ (The Other End of the Line) లో ప్రధాన పాత్ర పోషించింది. కాంతస్వామి, పోక్కిరి రాజా, మిడ్‌నైట్స్ చిల్డ్రన్‌ (Midnight's Children)లో నటించింది. దీనికి ఆమె అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

పవిత్ర, చంద్ర వంటి చిత్రాలలో నటించడం ద్వారా సరన్ మంచి విజయాన్ని అందుకుంది .దృశ్యం 2, గౌతమిపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni) , RRR లో కూడా అనేక చిత్రాల్లో నటించి శ్రియ మెప్పించింది. ఉత్తమ నటిగా 52, 53 వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌కు ఎన్నో సార్లు నామినేట్ అయ్యింది.

సౌత్ స్కోప్ స్టైల్ అవార్డును కూడా గెలుచుకుంది. అలాగే స్టార్ డస్ట్ అవార్డులు, అంతర్జాతీయ తమిళ చలనచిత్ర అవార్డులు, 4 వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు, 13, 16, 17, 22 వ సంతోషం ఫిల్మ్ అవార్డులు.. ఇలా ఉత్తమ నటిగా అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం శ్రియకు పెళ్లి అయి, కూతురు ఉంది. అటు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఇటు సినిమాల్లో తన సత్తా చాటుతుంది. అలాగే శ్రియ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. తన ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో శ్రియ ఫొటోలను పంచుకుంది. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చెక్కు చెదరని అందంతో దర్శనమిచ్చిందని కొందరు అనగా.. స్టన్నింగ్ లుక్, కుర్ర హీరోయిన్‌ను తలపిస్తున్నావంటూ మరికొందరు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

READ MORE ...

Anasuya: అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే! పోస్ట్‌కు ఇవేం కామెంట్స్ రా బాబు?

Next Story