- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ అరాచకం..ఇద్దరు హీరోలు...పెళ్లి ఆ తర్వాత విడాకులు ?
టాలీవుడ్ హీరోయిన్లలో... సమంతకు ( Samantha) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇండస్ట్రీలోనే.. దాదాపు 14 సంవత్సరాలుగా సమంత

దిశ వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్లలో... సమంతకు ( Samantha) ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇండస్ట్రీలోనే.. దాదాపు 14 సంవత్సరాలుగా సమంత టాప్ 5 లోనే కొనసాగుతున్నారు. అయితే అలాంటి... సమంత తన పర్సనల్ లైఫ్ లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు హీరోయిన్ సమంత. ఇవాల్టితో 38 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సమంత గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా హీరోయిన్ సమంత పర్సనల్ జీవితం గురించి సోషల్ మీడియాలో కొంతమంది వార్తలు వైరల్ చేస్తున్నారు. హీరోయిన్ సమంత ఇద్దరు హీరోలతో రిలేషన్ పెట్టుకొని.. ఒకరితో విడాకులు కూడా తీసుకుందని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రాకముందు హీరోయిన్ సమంత.... సిద్ధార్థ తో ( Siddarth) రిలేషన్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు హీరో సిద్ధార్థ్.. తమిళంలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా కొనసాగాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్లి వరకు వెళ్లి విడిపోయారు.
అనంతరం ఏం మాయ చేసావే సినిమా సమయంలో... అక్కినేని నాగచైతన్య ( Akkineni Nagachaitanya ) జంటగా సమంత నటించి... సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సందర్భంగానే... హీరోయిన్ సమంత... అక్కినేని నాగచైతన్య ఇద్దరు ప్రేమలో పడ్డారట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ 2021 డిసెంబర్ లో అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు హీరోయిన్ సమంత సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన కూడా సమంత పడింది. కానీ ఇప్పటికీ... ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 5 లో కొనసాగుతోంది. సంపాదనలో కూడా హీరోలకు తగ్గకుండా.. దూసుకు వెళ్తోంది.






