Samantha: ‘ఏమాయ చేశావే మూవీలోని అన్ని సీన్స్ ఇప్పటికీ గుర్తున్నాయి’.. నెట్టింట దుమారం రేపుతోన్న సమంత కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-08-01 04:50:50  IST  )

అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకున్న నటీమణుల్లో సమంత (Samantha)ఒకరు.

Samantha: ‘ఏమాయ చేశావే మూవీలోని అన్ని సీన్స్ ఇప్పటికీ గుర్తున్నాయి’.. నెట్టింట దుమారం రేపుతోన్న సమంత కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకున్న నటీమణుల్లో సమంత (Samantha)ఒకరు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా కొద్ది రోజుల్లోనే కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీకి గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ అమ్మడు నటించినా సినిమాలు ఫ్లాప్ అయినా.. బ్లాక్ బస్టర్ హిట్ అయినా మాకు ఆల్ టైం ఫేవరెట్ నటి సామ్ అని చెప్పుకునే వారు కోట్లలో ఉన్నారు.

సమంత సత్తాను అతి తక్కువ సమయంలోనే బయటపెట్టి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. కెరీర్ మొదట్లోనే ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఏమాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Walkitlo Sirimalle Chettu) , ఎటో వెళ్లిపోయింది మనసు, సమ్‌థింగ్ సమ్‌థింగ్ (Something Something), అత్తారింటికి దారేది, ఆటోనగర్ సూర్య (Autonagar Surya), ఖుషీ, జాను(Jānu), ఓ బేబీ, యశోద (Yashoda) వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

వీటితో పాటుగా సమంత వెబ్ సిరీస్‌ల్లో కూడా మెరిసింది. అలాగే ఐటెమ్ సాంగ్స్‌లో నటించి తన సత్తా చాటింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ మొదటి భాగంలో ‘ఊ అంటావా మావా’ అంటూ గ్లామర్ స్టెప్పులేసి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం సామ్ మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే సమంత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. పదిహేను ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కెరీర్ స్టార్టింగ్‌లో నాకు ఎవరు తెలియదు. అన్ని కొత్తే, సినీ పరిశ్రమలో ఫ్రెండ్స్, రిలేషన్స్ లేరని తెలిపింది. అలాగే ఈ పదిహేను ఏళ్లలో జరిగిన పలు విషయాలు ఇప్పటికీ మర్చిపోలేను.. కానీ కొన్ని మాత్రం గుర్తు లేవని తెలిపింది. ప్రారంభ దశలో ఏం బాగా నటించలేదని, కనీసం భాష కూడా రాదని.. కానీ వాటి నుంచే పాఠాలు నేర్చుకున్నానని సామ్ చెప్పుకొచ్చింది.

స్టార్టింగ్‌లో గ్లామర్ రోల్స్ చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉండేదని పేర్కొంది. ముందు నాకు అవకాశం వచ్చింది మాస్కో కావేరి సినిమాలో.. కానీ ఒక్క రోజు చిత్రీకరణ తర్వాత ఆగిపోయిందని తెలిపింది. ఇక తర్వాత ఏమాయ చేశావే మూవీలో నటించానని.. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అని పేర్కొంది. ఇందులోని ప్రతి షాట్ ఇప్పటికీ గుర్తున్నాయని, కార్తిక్‌ను గేట్ దగ్గర మీట్ అయ్యే సన్నివేశం అదే ఫస్ట్ షాట్ అని సమంత గుర్తు చేసుకుంది.

ఏమాయ చేశావే చిత్రానికి సంబంధించి ప్రతీవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయని.. అలాగే డైరెక్టర్ గౌతమ్ మేనన్‌(Director Gautham Menon)తో కలిసి వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొచ్చింది. ఒక పాత్రను ఎలా తీర్చిదిద్దాలో గౌతమ్ కు బాగా తెలుసునని ఈ నటి కొనియాడింది. ఈ గడిచిన 15 సంవత్సరాలు నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ అని హ్యాపీ కామెంట్స్ చేసింది. ఇన్నేళ్లలో నా లైఫ్‌లో కష్టాలు, సుఖాలు, విజయాలు, అపజయాలు అన్ని పలకరించాయని సమంత వెల్లడించింది.

Next Story