- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Riddhi Kumar: ప్రభాస్ అలాంటి వ్యక్తి.. ఆ ఎక్స్‌పీరియన్స్ మాటల్లో చెప్పలేను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
మరాఠీ ముద్దు గుమ్మ రిద్ధి కుమార్.. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ సినిమాతో బిజీగా ఉంది.

దిశ, సినిమా: మరాఠీ ముద్దు గుమ్మ రిద్ధి కుమార్.. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ సినిమాతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9 రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ రిద్ధి కుమార్ డార్లింగ్ (ప్రభాస్)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన నేను.. ఇప్పుడు ది రాజాసాబ్‌లో ఆయన పక్కన హీరోయిన్‌గా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్. ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది. టైటిల్‌కు తగిన విధంగా షూటింగ్ సెట్స్‌ను చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఇక డార్లింగ్ గురించి అయితే చెప్పక్కరలేదు. ప్రభాస్ నిజంగా చాలా మంచి వ్యక్తి. ఆయనతో పని చేయడం ఎంతో ఈజీగా ఉంటుంది. ఆయన చాలా స్వీట్. ఎదుటివాళ్లను అర్థం చేసుకునే వ్యక్తి. అవసరమైన చోట సహాయం చేస్తారు.. అలాగే ఎంతో కష్టపడతారు. రాజాసాబ్ సినిమాను కచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ది రాజాసాబ్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్ కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.






