- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna:రేవతి మృతి పై స్పందించిన హీరోయిన్ రష్మిక
సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 (Pushpa 2) మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

దిశ,వెబ్డెస్క్: సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 (Pushpa 2) మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ క్రమంలో నిన్న(బుధవారం) రాత్రి నుంచి బెనిఫిట్ షోలు సందడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అయితే.. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి అక్కడి రాగా.. బన్నీని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీతేజ్ ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రేవతి మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి మృతి చెందడం పై హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) స్పందించారు. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్న సంధ్యలో ప్రీమియర్ షోను అల్లు అర్జున్తో కలిసి రష్మిక చూశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.






