- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna : ఇండస్ట్రీలో 8 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరోయిన్.. స్పెషల్ వీడియో వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రష్మిక ఫ్యాన్స్ క్లబ్(Rashmika Fan Club) నుంచి హీరోయిన్ జర్నీకి సంబంధించి ఓ ఎమోషనల్ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోపై ఈ ఎర్రచందనం బ్యూటీ స్పందిస్తూ ఎమోషనల్ ఇమోజీలు షేర్ చేసింది. కాగా.. 2016లో ‘కిరిక్ పార్టీ’(Kirik Party) అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఇప్పటి వరకు నాలుగు భాషల్లో నటించి మెప్పించింది. ఇక ‘గీతా గోవిందం’ (Geetha Govindam)సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయిన ఈ బ్యూటీ.. ‘పుష్ప’తో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రజెంట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.






