- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు విజయ్ దేవరకొండ మొత్తం కావాలి..రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ పై రష్మిక హాట్ కామెంట్స్
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వెకేషన్లకు వెళ్లడం, ఒకే లొకేషన్‌లో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఒకటి రెండు సార్లు విజయ్ ఇంటికి కూడా రష్మిక వెళ్లడంతో ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్‌తో పాటు గీతా గోవిందం సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో పాటు బయట కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను రష్మిక కానీ విజయ్ కానీ ఎప్పుడూ ఖండించలేదు.
కాకపోతే సమాధానం దాటవేశారు అంతే. విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అని రష్మిక చెబితే.. రష్మిక తనకు మంచి ఫ్రెండ్ అని విజయ్ చెప్పాడు. కానీ ఒకరి గురించి మరొకరిని అడిగినప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ మాటల్లో బయటపడుతోంది. తాజాగా రష్మిక విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. యాంకర్ సుమ కొందరు హీరోల పేర్లు చెప్పి వాళ్ల నుండి మీకు ఏం కావాలని ప్రశ్నించింది. దానికి రష్మిక సమాధానం ఇస్తే అల్లు అర్జున్ స్వాగ్, నాగార్జున చార్మింగ్, ధనుష్ ఎండలో కూడా పనిచేయగల సామథ్యం కావాలని చెప్పింది. మరి విజయ్ దేవరకొండ నుండి ఏం కావాలని ప్రశ్నించగా అతడి నుండి ప్రతి ఒక్కటీ కావాలని ఆలోచించకుండా సమాధానం ఇచ్చింది. దీంతో నేషనల్ క్రష్ తన ప్రేమను మరోసారి బయటపెట్టింది.






