Rashi : ఈ సంక్రాంతికి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాను.. రీ ఎంట్రీపై బిగ్ అప్డేట్ ఇచ్చిన సీనియర్ స్టార్ హీరోయిన్

by Chukka Sudharani |

ఒకప్పటి అందాల తారా రాశి.. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Rashi : ఈ సంక్రాంతికి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాను.. రీ ఎంట్రీపై బిగ్ అప్డేట్ ఇచ్చిన సీనియర్ స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: ఒకప్పటి అందాల తారా రాశి.. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. డిఫరెంట్ పాత్రల్లో నటించిన ఈ హీరోయిన్ ఒకప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు సీరియల్స్‌లో మెయిన్ లీడ్‌లో నటిస్తుంది. అలాగే టీవీ షోలలో మెరుస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి.. సినిమాల్లోకి రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ‘నేను మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను... ఇప్పటికే 5 సినిమాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అంతే కాకుండా.. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మళ్లీ మిమ్మల్ని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు వెయిటింగ్ అంటూ మెసేజులు చేస్తున్నారు నెటిజన్లు. లింక్

Next Story