సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్.. ఇంతకు ఎవరిని ఉద్దేశించి పెట్టిందో..!

by Chukka Sudharani |   (  Updated:2025-02-15 11:47:31  IST  )

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్.. ఇంతకు ఎవరిని ఉద్దేశించి పెట్టిందో..!
X

దిశ, సినిమా: హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. గతేడాది ఇండియన్-2(Indian-2)తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. త్వరలో ఇండియన్-3తో మరోసారి పలకరించనుంది. ప్రజెంట్ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన రకుల్.. తాజాగా అజయ్ దేవగన్(Ajay Devgn), మాధవన్‌(Madhavan)లతో కలిసి ‘దేదే ప్రాయ్ దే-2’ (Dede Pray De-2)చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది రకుల్. జిమ్ వీడియోస్‌తో పాటు పలు పోస్ట్‌లు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ పోస్ట్ పెట్టింది ఈ హీరోయిన్.

అందులో ‘కంఫర్ట్ జోన్ మీ శత్రువు. కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన ప్రదేశం, కానీ అక్కడ ఏమీ ఎదుగుదల ఉండదు.. అలాగే బయట ప్రపంచం గురించి తెలియదు. ప్రజలు ప్రతిదీ రేపు చేద్దాములే అని ఎల్లప్పుడూ అనుకుంటారు. సోమరితనానికి ఇది అతిపెద్ద కారణాలలో ఒకటి. ఇంకా వారు తమ జీవితాలతో చాలా సౌకర్యంగా ఉండటం. పనులు జరుగుతున్న తీరును మార్చడం వారికి ఇష్టం లేదు. మీరు ఎల్లప్పుడూ చేస్తున్న పనులను చేయడం చాలా సులభం.. కానీ మీరు ఏదైతే కోరుకుంటారో ఆ వృద్ధికి ఇవి పనికిరావు. కాబట్టి మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి తప్పుకుని కష్టమైన పనులను చేయాలని పెరుగుదల డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే సక్సెస్ చూడటం సులభం.. కానీ గెలవడం కష్టం’ అంటూ ఓ మోటీవేషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది రకుల్.

Next Story