ఈ సినిమాలో అదే హైలెట్.. వారణాసి చిత్రంపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

వారణాసి చిత్రంపై, తన వివాహబంధంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో తెలిపింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

ఈ సినిమాలో అదే హైలెట్.. వారణాసి చిత్రంపై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం తెలుగులో ‘వారణాసి’ చిత్రంలో నటిస్తుంది. మహేశ్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టు ప్రజెంట్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక సినిమా విశేషాలు పంచుకుంది. వారణాసిలో కాల ప్రయాణం గురించి చెబుతూ.. ‘ఇది ఒక యంత్రంలో కూర్చుని ‘Back to the Future’ సినిమాలో లాగా ప్రయాణించే పద్ధతి కాదు. మా పాత్రలు వివిధ లోకాలు, పరిధుల గుండా వెళ్తూ క్రీ.పూ. 7200 నుండి 2027 వరకు ప్రయాణిస్తాయి. అదే ఈ కథనాన్ని ఆసక్తికరంగా మారుస్తుంది. కాబట్టి ఇది ఒక కాల ప్రయాణ (time-travel) చిత్రం’ అని తెలిపింది.

అలాగే తన వివాహబంధంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘నేను, నిక్ జోనస్ విడాకులు తీసుకుంటున్నామంటూ వస్తున్న కొన్ని వార్తలు నా చెవిన పడ్డాయి. మా పెళ్లి బంధం ముగిసిపోవాలని కొందరు కోరుకుంటున్నారా? అనిపిస్తోంది. అసలు మా పరిచయం తర్వాత కేవలం ఆరు నెలల్లోనే మేము పెళ్లి చేసుకున్నాం. నిక్‌లో ఉండే నిజాయతీ నన్ను ఎంతగానో ఆకర్షించింది. మేము ఎనిమి ఏళ్లుగా కలిసే ఉన్నాం. అలాంటప్పుడు మా బంధానికి సంబంధించి ఇలాంటి వార్తులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. అయినా ఇతరులు ఏమనుకుంటున్నారో అని నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను. నా బిడ్డతో మేము మా లైఫ్ ఎంతో అందంగా లీడ్ చేసుకుంటున్నాము’ అని తెలిపింది.

Next Story