- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫెయిల్యూర్స్‌కి నేనెప్పుడూ కుంగిపోను.. స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్
టాలీవుడ్ బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే.. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అనుకున్న రేంజ్‌లో హిట్ తెచ్చుకోలేకపోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే.. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అనుకున్న రేంజ్‌లో హిట్ తెచ్చుకోలేకపోతుంది. అయితే.. ఇటీవల మాత్రం కూలీ చిత్రంలో స్పెషల్ సాంగ్ ‘మోనిక’తో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న పూజా తన సినీ ప్రయాణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కెరీర్ స్టార్టింగ్‌లోనే పరాజయాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నా. అయితే.. ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయాలు దక్కవు. అలా అని ఫెయిల్యూర్స్‌కి నేనెప్పుడూ కుంగిపోను. ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై గట్టి నమ్మకంతో ఉన్నాను. ఈసారి మాత్రం నా అంచనాలు తప్పవు. మళ్లీ తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తానని నమ్మకం ఉంది’ అని చెప్పింది. కాగా.. ప్రస్తుతం పూజా చేతిలో జననాయగన్, కాంచన -4 వంటి భారీ ప్రాజెక్ట్‌లున్నాయి.
- Tags
- Pooja Hegde






