- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటా.. హీరోయిన్ పాయల్ కామెంట్స్ వైరల్
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

దిశ, సినిమా: ‘పాపం ప్రతాప్’ ఫేం పాయల్ రాధాకృష్ణ, ‘ఈషా’ ఫేమ్ త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. మే 15న సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘నాకు నిజంగా తెలుగు అబ్బాయే కావాలి. నా హార్ట్, మైండ్ అంతా ఇక్కడే ఉన్నాయి. నేను నిజంగా హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా నాకు వర్క్ ఇచ్చింది, ఫేస్ వ్యాల్యూ ఇచ్చింది, డబ్బుల ఇచ్చింది, పీస్ ఇచ్చింది, అన్నీ హైదరాబాద్, తెలుగు ఆడియన్సే. నాకు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను లైఫ్‌లో చేసింది అంతా ఇక్కడే ఉంది. కాబట్టి నేను హైదరాబాద్‌ను, తెలుగును వదిలే ప్రసక్తే లేదు’ అని చెప్పుకొచ్చింది.






