భర్త, పాపతో ఫొటోస్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరన్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భర్త, పాపతో ఫొటోస్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరన్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్‌లో ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న’(Mallanna) సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్‌తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. లవర్స్ డే స్పెషల్‌గా తన భర్త, పాపతో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. అంతేకాకుండా ‘హ్యాపీ వాలెంటైన్స్ డే లవ్లీ పీపుల్. ప్రేమగా ఉండు! అండ్ నేను మిమ్మల్ని కనుగొన్నాను. మీరు నాకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన ప్రయాణం స్టార్ చేసిన చోట నుండి మనం ఉన్న చోటు వరకు… విశ్వానికి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ‘వావ్ క్యూట్ కపుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story