ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో హాట్ ఫొటోస్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో హాట్ ఫొటోస్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్(Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. స్టార్టింగ్ ట్రెడిషనల్‌గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న’(Mallanna) సినిమాతో బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్‌తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్‌కి అందం విషయంలో మంచి ఫిజిక్‌ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుని హాట్‌గా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా వాటికి ‘బాస్ మోడ్ ఆన్’ అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story