- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఈ చిత్రాలన్నీ నాకు చాలా ఇష్టమైనవి’.. బహుమతిగా ఇచ్చిన చీరపై రష్మిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ 2014 లో మోడలింగ్ ప్రారంభించి.. అదే ఏడాదిలో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేసింది. తర్వాత నేషనల్ క్రష్ కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత ఈ హీరోయిన్ పునీత్ రాజ్ కుమార్ సరసన అంజని పుత్ర, గణేష్‌కు జోడిగా ఛమక్ అనే మూవీల్లో అవకాశం కొట్టేసింది. నాగశౌర్యతో కలిసి ఛలో సినిమాలో అదర్భుతంగా నటించి.. తన క్యూట్‌నెస్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ భామ వరుస చిత్రాలతో అలరించింది.
దేవదాస్, గోత గోవిందం, యజమన, డియర్ కామ్రేడ్, భీష్మ, పొగరు, సుల్తాన్, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు, సీతారామం, వారసుడు, మిషజ్ మజ్ను, యానిమల్, పుష్ప ది రూల్, ఛావా సికందర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. చీరపై పిక్స్ పంచుకుని.. ‘‘ఈ చిత్రాలన్నీ నాకు చాలా ఇష్టమైనవి. ఈ ఫోటోలోని రంగు, వాతావరణం, ప్రదేశం, నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ, ఫోటోగ్రాఫర్, ప్రతిదీ నాకు భర్తీ చేయలేనివి’’. అంటూ రాసుకొచ్చింది. ప్రజెంట్ నేషనల్ క్రష్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






