‘అందులో బస చేయడం మరింత ప్రత్యేకంగా అనిపించింది’.. ప్రారంభం నుంచి ముగింపు వరకు మరపురాని అనుభవమంటూ నటి పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ ముద్దుగుమ్మ నటి మెహ్రీన్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌‌తో ప్రత్యక్షమవుతుంటుంది.

‘అందులో బస చేయడం మరింత ప్రత్యేకంగా అనిపించింది’.. ప్రారంభం నుంచి ముగింపు వరకు మరపురాని అనుభవమంటూ నటి పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ముద్దుగుమ్మ నటి మెహ్రీన్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌‌తో ప్రత్యక్షమవుతుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోషూట్లు చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ ఓ హోటల్‌కెళ్లిన అనుభవాన్ని పంచుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు పంచుకుని.. ‘‘ఎస్ప్లానేడ్ హోటల్ జాగ్రెబ్ నిజంగా నాకు ఇష్టమైన హోటళ్లలో ఒకటిగా మారింది.

100 సంవత్సరాల అకాల సౌందర్యాన్ని జరుపుకునే ఈ ఐకానిక్ హోటల్ ప్రారంభం నుండి ముగింపు వరకు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. వారి మిచెలిన్-లిస్ట్ చేసిన లె బిస్ట్రోలోని అద్భుతమైన భోజనం నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది వారి అక్కడ బస చేయడం మరింత ప్రత్యేకంగా అనిపించింది.నాకు మొత్తం అనుభవం కూడా పూర్తిగా నచ్చింది’ అంటూ మెహ్రీన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది.

ఇకపోతే ఈ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పిర్జాదా (Mehreen Kaur Pirzada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ (Krishna Gaadi heroic love story) చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి తెరంగేట్రం చేసింది. ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani)సరసన కథానాయికగా నటించింది తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది నటి మెహ్రీన్.

ఈ మూవీకి హను రాఘవూడి (Hanu Raghavudi) దర్శకత్వం వహించాడు. 2017 లో ఫిలౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. అక్కడ కూడా తన సత్తా చాటింది. తర్వాత మోహ్రీన్ మరిన్ని సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.instagram link

Next Story