- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతికి సెలైన్ పెట్టుకుని బెడ్‌పైన హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ 2017 విజేతగా నిలిచింది. ఇది భారతదేశానికి 17 సంవత్సరాల తర్వాత వచ్చిన విజయం. అంతేకాకుండా.. నటిగా, మోడల్‌గా కూడా గుర్తింపు పొందింది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో హర్యానాకు ప్రాతినిధ్యం వహించి, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
సినిమాల విషయానికొస్తే..
ఈమె అందాల పోటీలలో పాల్గొనడంతో పాటు, అనేక ఫ్యాషన్ ఈవెంట్లలో కూడా పాల్గొని జనాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. మానుషి చిల్లర్ బాలీవుడ్‌లో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ సరసన పృథ్వీరాజ్ సినిమాలో అవకాశం కొట్టేసింది. అలాగే బడే మియా చోటే మియా అండ్ మాలిక్ వంటి సినిమాల్లో కూడా నటించింది. వీటితో పాటు ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ,ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాల్లో అద్భుతంగా నటించి తన ప్రతిభ కనబర్చింద.
వ్యక్తిగత విషయానికొస్తే..
మానుషి చిల్లర్ తరచూ అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాల్ని పంచుకుంటూ ఉంటుంది. ఏ వెకేషన్, ఈవెంట్లకు వెళ్లినా.. వాటికి సంబంధించిన ఫొటోలు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లు కూడా నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ వార్త ఎంత వరకు వాస్తవమో తెలియదు. ఇకపోతే ఈ నటి తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. జిమ్‌లో నేలపై కూర్చుని థైస్, నడుము, ఎద అందాల్ని ప్రదర్శిస్తూ.. ఫొటోలకు ఫోజులిచ్చింది. అలాగే మరో ఫొటోలో చేతికి సెలైన్ పెట్టుకుని ఉండటంతో, ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.instagram link






