Malavika Mohanan: మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |

Malavika Mohanan: మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మోహన్ లాల్ (Mohan Lal), మాళవిక మోహనన్ జంటగా నటించిన చిత్రం ‘హృదయపూర్వం’ (Hrudaya Poorvam). సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 28న రిలీజై సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మాళవిక మోహనన్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘గత కొన్ని రోజులుగా మీరు కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇంత మంది నన్ను సంప్రదించి మీ ‘హృదరపూర్వం’ హృదయాలను తాకిందని చెప్పడం సంతోషంగా ఉంది. నాకు హరిత పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ సత్యన్‌కు ధన్యవాదాలు.

నేను మీతో కలిసి పనిచేయడం నా డ్రీమ్. ఎందుకంటే మీ సినిమాల పట్ల నాకున్న అభిమానానికి మించి.. మీరు స్త్రీ పాత్రలను రాసే విధానం నన్ను ఎంతగానో కదిలించింది. అంత డెప్త్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించే మీ విధానం.. కథ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం పాటు జీవిస్తాయి. మీరు తీసే విధానం చాలా దయగా, సున్నితంగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఈ అధ్యాయం ఎప్పుడు నా ప్రయాణంలో మోస్ట్ కలర్‌ఫుల్ బుక్‌మార్క్‌ను కలిగి ఉంటుంది. మీలో ఇంకా మా సినిమాను చూడని వాళ్లు ఉంటే వెంటనే థియేటర్లలో చూడండి. ఇది మీ హృదయాన్ని దోచుకుంటుదని నేను మీకు హామీ ఇస్తున్నా’ అని రాసుకొచ్చింది మాళవిక. లింక్


Next Story