సమ్మర్ వేళ ఈ సీరమ్ వాడండంటూ నెటిజన్లకు స్టార్ హీరోయిన్ సలహా..

by Kodari Anjali |

బాలీవుడ్‌‌లో జాకీ ష్రాప్ కుమారుడు టైగర్ ష్రోప్ సరసన హీరోపంతి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

సమ్మర్ వేళ ఈ సీరమ్ వాడండంటూ నెటిజన్లకు స్టార్ హీరోయిన్ సలహా..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌‌లో జాకీ ష్రాప్ కుమారుడు టైగర్ ష్రోప్ సరసన హీరోపంతి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 2021 లో తెరకెక్కిన మిమీ మూవీలో తన అద్భుతమైన నటనకు అనేక అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఉత్తమ నటిగా ఫిల్మ ఫేర్ అవార్డు, ఉత్తమ నటి జాతీయ చలనచిత్ర అవార్డు.. గంగూబాయి కతియావాడి సినిమాకు బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ తో కలిసి గెలుచుకుంది. అంతేకాకుండా ఈ హీరోయిన్ 2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో పేరు దక్కించుకుంది.

అలాగే తెలుగులో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన నేనొక్కడినే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. వీటితో పాటుగా హీరోపంతి, దోచేయ్, దిల్ వాలే, రాబ్తా, బరేలీ కి బర్ఫీ, స్త్రీ, లుకా చుప్పి, కలంక్, అర్జున్ పాటియాలా, హౌస్ ఫుల్ 4, పానిపట్, పతి పత్నీ ఔర్ వో, మిమీ, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే, హీరోపంతి 2, భేదియా, షెహజాదా, ఆదిపురుష్, గణపథ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే తాజాగా ఈ నటి నెటిజన్లకు ఓ సలహా ఇచ్చింది. ‘‘ఇది నాకు మంచి ఎంపికగా ఉంది. మా ప్రియమైన GHG సీరం ఇప్పుడు 56% యాక్టివ్‌లతో మరింత మెరుగ్గా ఉంది. ఇందులో 5% నియాసినమైడ్, 1% ఆల్ఫా అర్బుటిన్ అండ్ 25% విటమిన్ సి అధికంగా ఉండే కాకడు ప్లం ఉన్నాయి. leshyphen.comలో దీన్ని చూడండి’’ అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Next Story