- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్టీ స్టారర్ చిత్రంలో కయ్యదు లోహర్!
అనిల్ రావిపూడి నెక్ట్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులో కీలక పాత్రలో కయ్యదు లోహర్.

దిశ, సినిమా: వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత అనిల్, వెంకటేష్ కలయికలో వస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్‌తో రెండవ చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. 2027 సంక్రాంతి టార్గెట్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించి సాంకేతిక బృందం వివరాలు, ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియజేయనప్పటికీ.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కయ్యదు లోహర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఫైనల్ కాగా.. త్వరలో అదికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.






