- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jyothika:‘స్టార్ డమ్ వదిలేసి పిల్లల పనులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాం’: జ్యోతిక
డబ్బా కార్టెల్ (Ḍabba kārṭel) ప్రమోషన్స్‌లో భాగంగా సీనియర్ హీరోయిన్ జ్యోతిక తన కెరీర్ గురించి పలు ముచ్చట్లు మాట్లాడింది.

దిశ, వెబ్‌డెస్క్: డబ్బా కార్టెల్ (Ḍabba kārṭel) ప్రమోషన్స్‌లో భాగంగా సీనియర్ హీరోయిన్ జ్యోతిక తన కెరీర్ గురించి పలు ముచ్చట్లు మాట్లాడింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ కూడా నిరాశపడలేదని చెప్పుకొచ్చింది. నటిగా మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ.. వృత్తిలో డెవలప్ అవుతున్నానని.. ముఖ్యంగా జనాలకు గుర్తుండిపోయే రోల్స్ చేస్తున్నానని తెలిపింది.
అలాగే డబ్బా కార్టెల్ లోని ప్రతి సన్నివేశం కూడా నన్ను బాగా ఆకట్టుకుందని.. షబానా అజ్మీ(Shabana Azmi) లాంటి గొప్పవారితో కలిసి నటించడం నింగా చాలా హ్యాపీగా ఉందని.. మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అని జ్యోతిక (Jyothika) వివరించింది. మోజి చిత్రంలో మగ, చెవిటి గర్ల్ గా నటించానని.. నాకు ఆ రోల్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఈ మూవీ నా కెరీర్ కు మైలురాలు వంటిదని పేర్కొంది. వీటితో పాటుగా ప్రిన్సిపల్ అండ్ న్యాయవాదిగా నటించిన పాత్రలు కూడా నచ్చాయని వెల్లడించింది.
అలాగే తమిళంలో మొదటి చిత్రం భర్త సూర్యతో కలిసి నటించినది ఎప్పుడు మర్చిపోలేనని తెలిపింది. ఈ మూవీ అనంతరం తమిళ్ లో చాలా ఆఫర్లు వచ్చాయని వెల్లడించింది. ఇంట్లో ఇద్దరు స్టార్స్ ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్న ఎదురవ్వగా.. స్టార్ డమ్ అనేది మేము ఇంటి బయటే వదిలేస్తామని.. ఇంటికెళ్లాక మా పిల్లల గురించే ఎక్కువ ఆలోచిస్తామని.. ముఖ్యంగా డైలీ మార్నింగ్ పిల్లలకు బాక్స్‌లు పెట్టివ్వడం లాంటివి సూర్య (Sūrya) నేను ఇద్దరం చూసుకుంటామని వెల్లడించింది. అలాగే 27 ఏళ్ల తర్వాత హిందీలో చాన్స్ రావడం ఆనందంగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం జ్యోతిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






