- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Imanvi: క్యూట్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న ఫౌజీ బ్యూటీ.. షాక్‌లో ప్రభాస్!
యంగ్ బ్యూటీ ఇమాన్వి (Imanvi) ‘ఫౌజి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఇమాన్వి (Imanvi) ‘ఫౌజి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో వస్తున్న ఈ చిత్రం ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి పలు పోస్టులు, ఫొటోలు కూడా వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 1974 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇమాన్వి ఎక్స్‌ప్రెషన్లు ఎక్స్‌లెంట్‌గా ఇస్తుందని భావించిన డైరెక్టర్ ప్రభాస్ ‘ఫౌజీ’లో హీరోయిన్‌గా ఈ బ్యూటీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వచ్చిన ఫొటోలు తప్పా.. ఈ సినిమాలో ఇమాన్వికి సంబధించి ఒక్క పోస్టర్ (Poster) కూడా రిలీజ్ చెయ్యలేదు మేకర్స్. దీంతో లవర్స్ డే స్పెషల్ (Lover's Day Special)గా అయినా ఇమాన్వి ఫస్ట్ లుక్ (First look) రిలీజ్ చెయ్యాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే మూవీ టీమ్ రిలీజ్ చెయ్యనప్పటికీ.. తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో మాత్రం ఈ హీరోయిన్ క్యూట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంది. ‘హ్యాపీ లవ్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘వావ్ సో బ్యూటీఫుల్’, ‘గార్జియస్’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం.. ప్రభాస్ షాక్‌తో చూస్తూ ఉండిపోయినట్లు ఇమోజీస్ షేర్ చేస్తున్నారు.






