- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్లో కలర్ డ్రెస్‌లో అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. ఆ సింబల్ జోడిస్తూ నెటిజన్ల కామెంట్స్.. ఫొటోలు వైరల్
‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ అమ్మడుదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.
కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా హెబ్బా పటేల్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్ వేసుకుని చెవులకు వేలాడే ఇయర్ రింగ్స్ పెట్టుకొని, బొట్టుపిల్ల పెట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా వాటికి ‘షాప్ ముల్’ అంటూ పొద్దుతిరుగుడు ఫ్లవర్స్‌ను యాడ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు అబ్బా హెబ్బా ఎల్లో కలర్ డ్రెస్‌లో ఏమన్నా ఉన్నావా అంటూ హార్ట్ సింబల్ ఉన్న ఎమోజీలు జోడిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






