- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామెడీ జానర్‌లో హెబ్బా.. కొత్త అప్డేట్ ఇచ్చిన హీరోయిన్
యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ కొత్త సినిమా ప్రకటించింది.

దిశ, సినిమా: ఢిపరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్.. ప్రజెంట్ వరుస చిత్రాలతో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘ఈషా’ సినిమాతో భయపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు సిద్ధం అవుతున్నది. తాజాగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘దర్జా’ సినిమా ఫేమ్ సలీం మాలిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఎం. సమీర్ సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మాలిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండా.. భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం.. షూటింగ్, ఇతర నటీనటుల విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.






