49 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. అలాంటి వాడే కావాలంటూ సంచలన ప్రకటన (పోస్ట్)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌(Sushmita Sen)కు పరిచయం అక్కర్లేదు.

49 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్.. అలాంటి వాడే కావాలంటూ సంచలన ప్రకటన (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌(Sushmita Sen)కు పరిచయం అక్కర్లేదు. 1994లో విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇక నటనపై ఆసక్తితో 1996లో ‘దస్తక్’(Dastak) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 2002లో ఏకంగా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) మూవీలో నటించి తన క్రేజ్‌కు పెంచుకుంది. చివకిసారిగా ‘తాలీ’ వెబ్‌సిరీస్‌లో కనిపించింది. ఇక సుస్మితా సేన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు సినిమాలు చేసిన దానికంటే పాపులర్ వ్యక్తులతో డేటింగ్‌ చేసి నెట్టింట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇక 2010లో అలిసాను దత్తత తీసుకుని పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే నటుడు రోహ్మన్ షాల్‌(Rohman Shawl)తో ప్రేమాయణం కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ.. 2021లో ఏవో కారణాల వల్ల అతడికి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్న సుస్మితా సేన్ 2022లో మళ్లీ లలిత్ మేడీ(Lalit Modi)తో డేటింగ్ చేసింది. ఇక అప్పటినుంచి అన్నింటికీ దూరంగా ఉంటుంది. 49 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, సుస్మితా సేన్ లైవ్ పెట్టి తన అభిమానులతో ముచ్చటించింది.

ఇందులో భాగంగా తాను ఓ పెళ్లికి హాజరై వచ్చానని చెప్పింది. దీంతో ఈ నెటిజన్లు ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించాడు. ఇక దానికి స్పందిస్తూ.. ‘‘నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరగదు. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించిన విషయం కాబట్టి. అయితే అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి కూడా నచ్చాలి అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా?’’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారు కొందరు షాక్‌‌కు గురవుతున్నారు. అలాగే మరికొందరు పలు ప్రశ్నలు వేస్తున్నారు.

Next Story