- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలమైన పాత్రల కోసం ఆ పని తప్పదంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
‘బాయ్స్’ సినిమాతో తెలుగు తెరకు పరియమైన బ్యూటీ జెనీలియా (Genelia D'Souza).

దిశ, సినిమా: ‘బాయ్స్’ సినిమాతో తెలుగు తెరకు పరియమైన బ్యూటీ జెనీలియా (Genelia D'Souza). తర్వాత సత్యం, సై, హ్యాపీ వంటి ఎన్నో చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు.. ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో యువతలో ఆమె క్రేజ్ కూడా విపరీతంగా పెరిగి అప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘నా ఇష్టం’ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. రీసెంట్‌గా బాలీవుడ్ ఆమీర్‌ఖాన్ నటించిన ‘సితారే జమీన్‌పర్’ (Sitare Zaminpar)లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు త్వరలో ‘జూనియర్’ (Junior Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఇకపై ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తానని, వాటి కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధమేనని తెలిపింది.
‘నేను చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. సీనియర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాను. అలాంటి నేను ఇప్పుడు ఇవ్వడమా అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఆడిషన్స్ ఇవ్వడం కరెక్ట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆడిషన్ ఇవ్వడం వల్ల సరైన పాత్రలను సెలక్ట్ చేసుకోవడం ఈజీ అవుతోంది. దాని వల్ల ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతాం. ఆడిషన్స్ ఇవ్వడంలో తప్పులేదని నా ఫీలింగ్. అలాగే ఈ విషయంలో చాలా హ్యాపీగా కూడా ఉన్నాను’ అని తెలిపింది.






