- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమపై హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ పోస్ట్ వైరల్
‘కలర్ ఫొటో’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణలీల’(Krishna Leela).

దిశ, సినిమా: ‘కలర్ ఫొటో’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ధన్య బాలకృష్ణన్ (Dhanya Balakrishnan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణలీల’(Krishna Leela). నటుడు దేవన్ (Devan) స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ షేర్ చేసింది ధన్య. ‘జాలి, ప్రేమే ఇలతిహాస కథలో ఏకమైతే’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ మూవీ ట్రైలర్.. ‘మనసులోని ప్రేమను ప్రేమించిన వారికి చెప్పే అవకాశం కలిగిస్తే ఎలాంటి అనర్థాలు జరగవు’ అనే డైలాగ్‌తో స్టార్ట్ కాగా.. ఈ సినిమా స్టోరీ మొత్తం ప్రేమ, ఆధ్యాత్మికతల మేళవింపుగా తెరకెక్కబోతున్నట్లు అర్థం అవుతున్నది. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం.. ధన్య మాట్లాడుతూ..
‘ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ముందుగా సురేష్ బాబు, లక్ష్మీ నారాయణలకు థాంక్యూ. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ వాళ్లకు మహా సేన్ విజువల్స్ ఎంట్రీ ఇచ్చింది. వాళ్లు ఫస్ట్ ప్రొడక్షన్‌తో మీ ముందుకు రాబోతున్నారు.. ప్రేక్షకులు ఈ సినిమాను సపోర్ట్ చేసి వాళ్లకు ఒక హార్ట్‌లీ వెల్‌కమ్ చెప్తారని ఆశిస్తున్నాను. చాలా సిన్సీయర్‌గా ఎఫెక్ట్ పెట్టి.. టైమ్ టు టైమ్ పేమెంట్స్ ఇచ్చి అందరిని ఎంకరేజ్ చేయబట్టే.. ఈ రోజు ఈ చిత్రం బయటకు రాగలుగుతుంది. 10 ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి.. ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి ఫైనల్‌గా ఈ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాడు దేవన్. అతను పని రాక్షసుడు. చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమాతో ఓ మార్క్ సొంతం చేసుకుంటాడని కోరుకుంటున్నాను. నన్ను ఎంత సపోర్ట్ చేశారో, నాకు ఎంత లవ్ ఇచ్చారో దేవన్‌కు కూడా మీ నుంచి అది లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపింది.






