- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిలను ఆ విధంగా చూస్తారు.. షూటింగ్‌లో చేదు ఘటనలపై హీరోయిన్ అనుపమ ఫైర్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) త్వరలో ‘పరదా’ (Parada) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

దిశ, సినిమా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) త్వరలో ‘పరదా’ (Parada) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Director Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. ఆనంద్ మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ (Rshan Rajendran), సీనియర్ నటి సంగీత (Sangeetha) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. షూటింగ్స్‌లో మేల్ డామినేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఇండస్ట్రీలో ఎక్కువ మేల్ డామినేషన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా చిన్న చిన్న అభిప్రాయాలు పంచుకోవడం కూడా కష్టం. ఒకవేళ వాళ్లకు నచ్చనిది ఏమైనా చెప్తే వెంటనే యాటిట్యూడ్ అంటారు. షాట్ ఎందుకు టైమ్‌కు పెట్టలేదు అని అడిగితే.. ఈ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఒకవేళ షాట్ మార్నింగ్ 7గంటలకు అనుకుంటే.. మనం రెడీ అయ్యి 7గంటలకే లోకేషన్‌కు వెళ్లి వెయిట్ చెయ్యాలి. కో యాక్టర్ డైలీ లేట్‌గా వస్తాడు అప్పుడు సాట్ 9:30 గంటలకు తీస్తారు. మరి మమ్మల్ని ఎందుకు ముందే రమ్మని పిలవడం. ఇప్పుడు వేస్ట్ అయిన రెండు గంటల్లో చాలా చెయ్యొచ్చు. మిగిలినవి అయినా షూట్ చెయ్యొచ్చు.. అలా అని చెప్పాము అనుకో.. నా డబ్బులు కదా నువ్వు ఎందుకు అడగాలి అంటారు.
నాకు చాలా నిరాశ అనిపిస్తది. అదే డిఫరెంట్ ఉంటుంది కానీ నేను ఇవేవి పట్టించుకోను. ఇప్పుడు ఇవన్ని నేను అడిగేది నా కోసం కాదు కదా.. సినిమా కోసమే కదా అది అర్థం చేసుకోరు. ఒక అమ్మాయి ఇలా అడగడం వాళ్లకు నచ్చదు.. దీంతో వెంటనే యాటిట్యూడ్ అంటారు. అయితే ఇదే ప్రశ్నలు అమ్మాయిలు కాకుండా వేరే ఎవరైన అడిగితే వాళ్లు ట్రీట్ చేసే విధానం టోటల్ డిఫరెంట్ ఉంటుంది. గర్ల్స్ పైనా డైరెక్ట్ ఎటాక్ ఉంటుంది.. ఇదే ప్రతీచోట జరుగుతుంది అని చెప్పను.. కానీ కచ్చితంగా ఇలా కూడా జరుగుతున్నాయి’ అని తెలిపింది.






