- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బికినీలో రెచ్చిపోయిన నాగార్జున హీరోయిన్ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు పాపులర్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు పాపులర్ అయితే మరికొంతమంది..వెనకబడిపోయారు. ఇక మరికొంతమంది హీరోయిన్లు... రీ ఎంట్రీ ఇచ్చి మరి రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అన్షు ఒకరు. టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ అన్షు (Anshu) గురించి తెలియని వారు ఉండరు.
ఈమె పేరు చెప్పగానే అందరికీ మన్మధుడు సినిమా గుర్తుకువస్తుంది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన మన్మధుడు సినిమాలో మహేశ్వరి పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించి అందరిని మెప్పించింది. ఈ సినిమాలో హీరోయిన్ అన్షు కేవలం 25 నిమిషాలు కనిపించినప్పటికీ కూడా..ఇప్పటికీ ఆమె అందరికీ గుర్తుకు వస్తూ ఉంటారు. అంతలా ఆమె పాత్ర తెలుగువారిని ఆకట్టుకుంది.
ఇక ఆ తర్వాత ప్రభాస్ చేసిన రాఘవేంద్ర సినిమాలో కూడా ఈ బ్యూటీ మెరిసింది. అనంతరం మిస్సమ్మ సినిమా చేసిన తర్వాత కనుమరుగైపోయారు. అయితే... ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ.. యూత్ ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈమె బికినీలో మెరిసింది. బ్లాక్ బికినీ ధరించి.. సముద్ర తీరాన సేద తీరింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన సినిమా ప్రియులు..హాట్ కామెంట్స్ పెడుతున్నారు.






