Heroine Anjali: విశాల్-35లో ఆ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ షేర్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

by Chukka Sudharani |

హీరో విశాల్ ప్రజెంట్ తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌కు సిద్ధం అయ్యాడు.

Heroine Anjali: విశాల్-35లో ఆ బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్ షేర్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: హీరో విశాల్ ప్రజెంట్ తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌కు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో అంజలి కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ.. ఆమెను ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేవారు. ఈ పోస్టర్‌లో అంజలి ట్రెడిషనల్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి దుషార విజయన్ విశాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. నటుడు విశాల్, దర్శకుడు రవి అరసు కాంబోలో ఇది మొదటి చిత్రం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు చిత్ర బృందం. Link


Next Story