పెళ్లి కాకుండానే గుడ్ న్యూస్ ప్రకటించిన హీరోయిన్ అంజలి.. నా బేబీ బాయ్‌కి వెల్‌కమ్ అంటూ పోస్ట్..

by I. Sairam |

టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే.

పెళ్లి కాకుండానే గుడ్ న్యూస్ ప్రకటించిన హీరోయిన్ అంజలి.. నా బేబీ బాయ్‌కి వెల్‌కమ్ అంటూ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే. ‘షాపింగ్ మాల్’(Shopping Mall) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రావట్లేదనే చెప్పాలి. తెలుగు అమ్మాయే అయినప్పటికీ మన టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోలేకపోతుంది. అయితే గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari) చిత్రంలో తన నటనతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాలో నటించింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది అంజలి. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అంజలి తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో క్యూట్ పప్పీతో దిగిన ఫొటోస్‌ను షేర్ చేసింది. దాన్ని హత్తుకున్న, కిస్ చేస్తున్న, కెమెరాకు చూపిస్తున్న పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘మా కొత్త కుటుంబ సభ్యుడిని పరిచయం చేస్తున్నాము నికో.. నా బేబీ బాయ్’ అంటూ హార్ట్ సింబల్ జోడించింది. ప్రస్తుతంఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నీ బేబీ బాయ్ నికో చాలా క్యూట్‌గా ఉన్నాడు అని, బుజ్జి కన్నా అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story