- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aishwarya Rajesh: నేను ఏ మతానికి చెందిన దానిని కాదు.. షాకింగ్‌గా హీరోయిన్ ఐశ్వర్య పోస్ట్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినప్పటికీ.. రీసెంట్‌గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినప్పటికీ.. రీసెంట్‌గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) హీరోగా, అనీల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నలుగురి పిల్లల తల్లిగా, వెంకటేశ్ భార్యగా నటించి ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ సినిమాలో ఐశ్వర్య యాక్టింగ్‌కు, కామెడీ టైమింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. దీంతో ప్రజెంట్ ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోవడంతో వరుస ఆఫర్స్ అందుకుంటూ.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్ (Successful heroine)గా రాణిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో భాషతో సంబంధం లేకుండా నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియా (Social media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రోఫిషనల్‌కు సంబంధించిన విషయాలు కూడా ఆడియన్స్‌తో పంచుకుంటూ సందడి చేస్తుంది. అంతే కాకుండా.. ట్రెండీ ట్రెండీ అవుట్ ఫిట్స్‌తో దర్శనమిచ్చి యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. ‘నేను ఏ మతానికి చెందిన దానిని కాదు’ అనే క్యాప్షన్‌తో కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. ప్రజెంట్ ఇవి నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘లేడీ బాస్‌లా ఉన్నావు.. వేరీ క్యూట్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.






