- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. ప్రీమియర్స్ రెస్పాన్స్‌తో ఆనందలో మూవీ టీమ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ భారీ అంచనాల మధ్య రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

దిశ, సినిమా: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ భారీ అంచనాల మధ్య రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. రిలీజ్ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఏ సినిమా చేసినా అందులో పర్పస్ ఉండాలని కోరుకునే దర్శక నిర్మాతను నేను. సినిమాలో వినోదంతో పాటు ఒక చిన్న మెసేజ్ ఏదైనా ఉండాలని ప్రయత్నిస్తాను. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను కూడా అలాగే ఫన్, మెసేజ్‌తో నిజాయితీగా ప్రయత్నం చేశాం. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న రెస్పాన్స్‌తో సంతృప్తిగా ఉన్నాం. ఇదే రెస్పాన్స్ రేపు థియేట్రికల్‌గా వస్తే ఇంకా సంతోషిస్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్‌తో పాటు కొన్ని సౌత్ స్టేట్స్‌లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. యూఎస్‌లో నెంబరాఫ్ లొకేషన్స్ దొరికాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి మా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.. నిజాయితీగా మేము చేసిన ప్రయత్నాన్ని క్రిటిక్స్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్స్ విజిట్, సక్సెస్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. ‘సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్.. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే హీరో కథ. మన తెలుగు ఆడియెన్స్‌కు నచ్చుతుందా అనే సందేహం ఉండేది. అయితే స్క్రిప్ట్ కంప్లీట్‌గా చదివాక ఎక్కడా లైన్ క్రాస్ కాకుండా, అసభ్యత లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూసేలా కథ ఉంది. దాంతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం కలిగింది. పెద్ద హీరోలు ఇలాంటి మూవీస్ చేయరు. వారికి ఇమేజ్ అడ్డు వస్తుంది. నాలాంటి కొత్త వాళ్లే ఇలాంటి డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి. పైగా కొత్త జానర్, కొత్త కథలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నాలాంటి కొత్త హీరోలు రెగ్యులర్ ఫార్మేట్ మూవీస్ చేస్తే ఎవరికీ నచ్చదు. డిఫరెంట్ మూవీస్ చేయాలి, అందరికీ రిలేట్ అయ్యేలా ఉండాలి అనుకున్నా. ‘సంతాన ప్రాప్తిరస్తు’లో కథ ఇన్ ఫెర్టిలిటీ అనే ఒక సెన్సిటివ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్‌టైన్మెంట్ యాడ్ చేశాం. సినిమా మూడొంతులు ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతుంది. చివరలో మంచి ఎమోషన్‌తో, మెసేజ్‌తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు’ అని చెప్పుకొచ్చాడు.






