ప్రభుత్వ ఓటీటీ ఎంతో అవసరం.. సీఎంకు హీరో విజయ్ విజ్ఞప్తి

by Chukka Sudharani |

సొంతం ఓటీటీ ఎంతైనా అవసరం అంటూ సీఎం దళపతి విజయ్‌కు హీరో విజయ్ సేతుపతి విజ్ఞప్తి చేశాడు.

ప్రభుత్వ ఓటీటీ ఎంతో అవసరం.. సీఎంకు హీరో విజయ్ విజ్ఞప్తి
X

దిశ, సినిమా: కరోన టైమ్‌లో థియేటర్స్ ఎక్కడికక్కడ మూత పడగా.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ బాగా పుంజుకున్నాయి. దీంతో దాదాపుగా కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీలోకి విడుదల అయ్యేయి. ఇక దాంతో ఓటీటీ డిమాండ్ కూడా బాబా పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకనే తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ ఇటీవల తమిళ ప్రభుత్వం సొంతంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ను ప్రారంభించాలంటూ సీఎం దళపతి విజయ్‌ను కోరారు. ఇప్పుడు తాజాగా విజయ్ సేతుపతి కూడా ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. కమల్ సార్ అడిగినట్టుగానే తమిళ ప్రభుత్వం సొంతంగా ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ను ప్రారంభించాలని సీఎం విజయ్ గారిని కోరారు. ఒకప్పుడు ఒక్కసారిగా పుంజుకుని భారీ వృద్ధి సాధించిన ఓటీటీ మార్కెట్ ఇప్పుడు అకస్మాత్తుగా పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు, కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ OTT ఎంతో అవసరమని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు.

Next Story