- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానుల మధ్య నలిగి.. కింద పడిపోయిన హీరో విజయ్.. వీడియో వైరల్
హీరో విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఫేర్‌వెల్ పార్టీ మాదిరిగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన క్రమం

దిశ, సినిమా : హీరో విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఫేర్‌వెల్ పార్టీ మాదిరిగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన క్రమంలో.. చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గర భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ గందరగోళంలో కారులోకి ఎక్కేటప్పుడు ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల తడబడి విజయ్ కింద పడిపోయాడు. అయితే సెక్యూరిటీ టీమ్ తక్షణమే సహాయం చేసి లేపింది. అయితే హీరోకు గాయాలేవి కాకపోవడంతో స్టాఫ్, ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. మలేషియాలో లక్షలాది మంది అభిమానులతో స్టేడియంలో సూపర్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ జరిగింది. కానీ ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వద్ద సడన్ సర్జ్ వల్ల గందరగోళం ఏర్పడింది. దీంతో చాలా మంది అభిమానులు మంచి స్పేస్, సేఫ్టీ మెజర్స్ కోసం కోరుతున్నారు. తద్వారా దళపతి స్వేచ్ఛగా, క్షేమంగా ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.






