బంగారంలా మెరిసిపోతున్న హీరో వెంకటేష్ మాజీ లవర్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బంగారంలా మెరిసిపోతున్న హీరో వెంకటేష్ మాజీ లవర్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. అయితే ఈ మూవీలో మీనాక్షి వెంకటేష్ మాజీ లవర్‌గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య సరసన ఎన్‌సి-24 మూవీతో పాటు నవీన్ పొలిశెట్టి సినిమాల కూడా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మీనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో గోల్డ్ కలర్ అవుట్ ఫిట్‌లో బంగారంలా మెరిసిపోతుంది. అలాగే వయ్యారాలు ఒలకబోస్తూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సూపర్ క్రేజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

Next Story