- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Great Pre-Wedding Show: షూట్ మొత్తం పిక్నిక్‌లా సాగింది.. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో పై హీరో కామెంట్స్
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.

దిశ, సినిమా: వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుండగా.. తాజాగా టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అనంతరం హీరో తిరువీర్ మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్ సజేషన్‌తో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ విన్నాను. కథ వింటున్నప్పుడు స్టార్టింగ్ నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నాను.
అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్సయ్యాను. మార్కెట్ లెక్కల గురించి ఆలోచించకుండా నిర్మాతలు సందీప్, రంజిత్ ధైర్యంగా సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ రిస్క్ చేసి సినిమా చేస్తున్నప్పుడు మంచి కథను సపోర్ట్ చేయడానికి నేను ఏం చేయగలను అనిపించింది. పప్పేట్ షో అనే బ్యానర్ లాంఛ్ చేసి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలో భాగం అయ్యాను. ఈ సినిమా నా నమ్మకాన్ని నిలబెడితే భవిష్యత్తులో ఇలాంటి కొన్ని సినిమాలు చేస్తాను. షూట్ మొత్తం పిక్నిక్‌లా సాగింది. ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమాగా ఇది నిలుస్తుంది’ అని చెప్పారు.






