- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది ఫెబ్ మంత్ కాదు ఫన్ మంత్.. మరో కొత్త మూవీతో వచ్చేస్తున్న సుహాస్
మరో సరికొత్త మూవీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు హీరో సుహాస్.

దిశ, సినిమా: మరో సరికొత్త మూవీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు హీరో సుహాస్. కొత్త దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ‘హే భగవాన్’ అనే క్యాచీ టైటిల్‌తో రాబోతున్నది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌ను ఎట్రాక్ట్ చేసిన యంగ్ బ్యూటీ శివాని నాగరం ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయబోతుండగా.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ మరో సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘హే భగవాన్’ మూవీ ఫిబ్రవరి 20 న రిలీజ్ కాబోతున్నట్లు తెలుపుతూ.. ‘ఇది ఫెబ్ మంత్ కాదు.. ఫన్ మంత్’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జత చేశారు. వీకే నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్, స్రవంతి చొక్కారపు తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్డేట్స్‌తో పాటు టీజర్ ఆకట్టుకోగా.. మూవీపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
- Tags
- Suhas
- HeyBhagawan






