క్యారెక్టర్ కోసం చాలా మారాల్సి వచ్చింది.. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ హీరో వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

‘మెన్షన్ హౌస్ మల్లేష్’ చిత్రంలో నా క్యారెక్టర్ కోసం కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేసి.. నేను చాలా మారాల్సి వచ్చింది అంటున్నాడు హీరో శ్రీనాథ్ మాగంటి.

క్యారెక్టర్ కోసం చాలా మారాల్సి వచ్చింది.. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ హీరో వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మంచి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాతో ఆడియన్స్ నా పేరు గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నా అంటున్నాడు హీరో శ్రీనాథ్ మాగంటి. ఆయన నటిస్తున్న ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ చిత్రానికి బాల సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. ఈ చిత్రం మార్చి 6న రిలీజ్‌కు ఉండగా.. సినిమాలో హైలెట్స్ పంచుకున్నాడు హీరె శ్రీనాథ్. ‘ఇందులో నేను పొగరుబోతు, దారితప్పి లేనిపోనీ అలవాట్లుతో ఉన్న ఓ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. అలాంటి వాడిని అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తీసుకోస్తారనేది చాలా సరదాగా చెప్పాం. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కామెడీ జానర్ ఫిల్మ్. ఫ్యామిలీ అంతా కలసి నవ్వుకునే సినిమా. ఈ సినిమాలో నన్ను నేను కొత్తగా చూపించుకోడానికి ఒక అవకాశం దొరికింది. ఇందులో యాక్టర్ కోసం కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ని అబ్జర్వ్ చేశాను. మల్లేష్‌ని చూపించడానికి నేను చాలా మారాల్సి వచ్చింది. ఈ సినిమాతో ఆడియన్స్ నా పేరు గుర్తుపెట్టుకుంటారని నమ్ముతున్నాను. మా ట్రైలర్ రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. చాలా బాగా వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం స్పిరిట్‌లో చాలా బిజీగా ఉన్నప్పటికీ సినిమా థియేటర్‌లో చూస్తా అని చెప్పారు’ అని తెలిపాడు.


Next Story